calender_icon.png 12 November, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లింట విషాదం.. చెట్టుకు ఉరివేసుకుని పెళ్లి కొడుకు ఆత్మహత్య

12-11-2025 08:39:20 AM

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం(Yedapally Mandal) మంగళ్ పాడ్ లో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. వివాహానికి ముందు పెళ్లి కొడుకు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ప్రతాప్(30)గా గుర్తించారు. ఇంట్లో గొడవ జరిగిందన్న మనస్తాపంతో ప్రతాప్ బయటకు వెళ్లిన ప్రతాప్ చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రతాప్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.