calender_icon.png 12 November, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం ప‌ర్య‌ట‌న‌కు న‌లుగురు మంత్రులు

12-11-2025 09:00:19 AM

హైదరాబాద్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో(Medaram Maha Jatara) బుధవారం నాడు నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎస్సీ,ఎస్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించనున్నారు. అనంతరం పలు శాఖల అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి ఆఖరిలో మేడారం మహా జాతర జరుగుతోంది. మేడారంకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. మేడారం జాతరలో భక్తుల సౌకర్యార్థం శాశ్వత అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.