4 September, 2026 | 2:35 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

14-11-2024 | 12:57pm

కొత్తకోట : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం అర్థరాత్రి వనపర్తి జిల్లా కొత్తకోట జాతీయ రహదారి పై చోటుచేసుకున్నది. ఎస్ ఐ మంజునాథరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అమడబాకులకు చెందిన శివకుమార్ (25) భార్యతో గొడవ పడగా ఆమె మనస్తాపంతో  పుట్టింటికి వెళ్ళి ఉంటుందని,  శివకుమార్ భార్య పుట్టిల్లు పామాపురం గ్రామానికి  వెళ్తుండగా 44 నెంబర్ జాతీయ రహదారిపై మమ్మళ్లపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ అక్కడికక్కడే మృతిచెందగా,  అతని శరీరం నుంచి వాహనాలు దూసుకెళ్లడంతో నుజ్జు నుజ్జుగా మారింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. శివకుమార్ కు భార్య శిరీష ఇద్దరు అబ్బాయిలు ఉన్నట్లు బంధువులు తెలిపారు.  ప్రస్తుతం శిరీష గర్భిణిగా ఉన్నట్లు వారు తెలిపారు.