ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
22-04-2026 12:55 AM
కోనేరు జమ్మలమ్మ ఆలయం వద్ద విషాదం...
అలంపూర్ ఏప్రిల్ 21: కోనేరు జమ్ములమ్మ ఆలయం వద్ద మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది.దైవ దర్శనానికి వచ్చిన అలంపూర్ కు చెందిన తెలుగు సురేష్ (36)అనే వ్యక్తి చెట్టుకు టెంటు తాడు కడుతుండగా అక్కడే నిలిపి ఉంచిన ట్రాక్టర్ ను పక్కకు తీసే క్రమంలో బైరంపల్లి గ్రామానికి చెందిన బోయ స్వాములు అనే వ్యక్తి గేర్ లో ఉన్న ట్రాక్టర్ను స్టార్ట్ చేశాడు.
ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు దూసుకు రావడంతో అక్కడే చెట్టుకు టెంటు తాడు కడుతున్న సురేష్ ను వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొట్టింది ఈ ఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య కూతురు ఉన్నారు.మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ పేర్కొన్నారు.






