22 April, 2026 | 2:27 AM

భగీరథ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

22-04-2026 12:53 AM

పోస్టర్ ఆవిష్కరణలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల

హైదరాబాద్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): సగర భగీరథ మహర్షి రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. మంగళవారం హైదరాబా ద్‌లోని బీసీ భవన్‌లో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. మహర్షి భగీరథ జయంతిని తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించడం హర్షనీయమన్నారు. ఈ నెల 23న హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఉత్సవాలకు అన్ని వర్గాల ప్రజ లు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మ న్ కుందారం గణేష్ ఆచారి, బీసీ సంక్షే మ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ, తెలంగాణ సగర సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏం ఆంజనేయులు సగర, దిండి శేఖర్ సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంగమ అధ్యక్షులు మూడేళ్ల రవి సగర, రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షులు గుంటి కృష్ణ సగర తదితరులు పాల్గొన్నారు.