calender_icon.png 20 December, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోయర్ మానేరులో పడి వ్యక్తి మృతి

21-10-2024 12:04:42 AM

మానకొండూర్, అక్టోబరు 20: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తిమ్మాపూర్ మండలానికి చెందిన బూర సాయికుమార్(29) హైదరాబాద్‌లోని రామ్‌టెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి ఇంటికి వస్తున్నానని చెప్పినా చేరలేదు. రాత్రి తిమ్మాపూర్ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన సాయికుమార్ ప్రమాదవశాత్తు డ్యాంలో పడి మృతిచెందాడు. ఆదివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.