21-10-2024 12:02:58 AM
పెద్దపల్లి, అక్టోబర్ 20 (విజయక్రాంతి): గోదావరిఖని పట్టణంలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 80 గ్రాముల గంజాయితో పాటు బైక్, రెండు సెల్‌ఫోన్‌లు సీజ్ చేసినట్టు వన్ టౌన్ సీఐ ఇంద్రసేనరెడ్డి తెలిపారు.