22 March, 2026 | 12:01 PM

పోచారం కాలువలో పడి వ్యక్తి మృతి

22-03-2026 10:35 AM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): పోచారం కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పోచారం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై భార్గవ్ గౌడ్ వివరాల ప్రకారం... హవేలి ఘనపూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ గౌడ్ వయసు (33) సంవత్సరాలు. శుక్రవారం గోపాల్పేట్ జాతరకు వెళ్తానని ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. దానితో కుటుంబ సభ్యులు శ్రీధర్ గౌడ్ ఫోనుకు ఫోన్ చేయగా అందుబాటులో లేకపోవడంతో శనివారం ఉదయం పోచారం గ్రామస్తులు ఫోన్ చేసి పోచారం గ్రామ శివారులోని డిస్ట్రిబ్యూషన్ కెనాల్ వద్ద ఫోన్ ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అనంతరం కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని అనుమానంతో కెనాల్లో వెతికిన ఆచూకీ లభించలేదు. వెంటనే ఎల్లారెడ్డి ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా ఫైర్ స్టేషన్ సిబ్బంది కెనాల్లో గాలింపు చేపట్టి సాయంత్రం నాలుగు గంటలకు మృతి దేహాన్ని బయటకు తీశారు. ప్రాథమిక విచారణలో గోపాల్పేట్ జాతరకు వెళ్లిన అనంతరం పోచారం కెనాల్ వద్ద శుభ్రం చేసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి పోచారం కెనాలలో పడిపోయారు. ఈత రాక నీరు మింగి మృతి చెందినట్లు మృతుని మరణంపై కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ.భార్గవ్ గౌడ్ తెలిపారు.