22 March, 2026 | 12:02 PM

ఉగాది పండగ సందర్భంగా మాసానిపల్లి గ్రామంలో కుస్తీల పోటీలు

22-03-2026 10:29 AM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఉగాది పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని మాసంపల్లి గ్రామంలో మూడవరోజు కుస్తీల పోటీలు గ్రామ సర్పంచ్ సునంద కిషన్ రెడ్డి, గ్రామ పెద్దలు అంజా గౌడ్, సిద్దా గౌడ్, శంకరయ్య, భాస్కర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బొల్లారం రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కుస్తీల పోటీలు 50 రూపాయల నుండి కుస్తీ పోటీలు ప్రారంభించి చివరి కుస్తీ పదిహేను వందల వరకు నిర్వహించడం జరిగిందని గ్రామ సర్పంచ్ సునంద కిషన్ రెడ్డి తెలిపారు.

కుస్తీల పోటీలో పాల్గొనేందుకు దూర ప్రాంతాలైనటువంటి నారాయణఖేడ్, బీదర్, ఖానాపూర్, మహారాష్ట్ర, జహీరాబాద్, కల్లెర్, పిట్లం, బిచ్కుంద ప్రాంతాల నుండి మలయోధులు తరలివచ్చి కుస్తీ పోటీలో పాల్గొన్నారు. 1500 చివరకు కుస్తీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఉస్మానియా యూనివర్సిటీ జాదో చరణ్ కైవసం చేసుకున్నారు.కుస్తీ పోటీలు చూడడానికి గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.