ఫామ్‌హౌస్‌లో పార్టీ.. స్విమ్మింగ్‌పూల్‌లో పడి యువకుడు మృతి
18-05-2026 12:26 PM
- మొయినాబాద్‌లో విషాదం
- ఫామ్‌హౌస్‌లో పార్టీ
- స్విమ్మింగ్‌పూల్‌లో పడి యువకుడు మృతి
మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్(Moinabad) మండలం కనక మామిడిలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన రోజు పార్టీకి వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో పడి యువకుడు మృతిచెందాడు. మృతుడు యాక్సిస్ బ్యాంకులో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ సాయి(28)గా గుర్తించారు. మృతుడికి భార్య, ఒక సంవత్సరం కొడుకు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తాము రాకముందే ఆస్పత్రికి తరలించడంపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.






