calender_icon.png 5 November, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరి వేసుకుని వ్యక్తి మృతి..

05-11-2025 07:50:06 PM

మద్యం మత్తులో ఘటన..

వెంకటాపురం/నూగూరు (విజయక్రాంతి): తాగుడికి బానిసై మద్యానికి డబ్బులు ఇవ్వలేదని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఉధంతం మండల పరిధిలోని అబ్బాయిగూడెం గ్రామంలో బుధవారం జరిగింది. వెంకటాపురం ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు కథనం ప్రకారం.. అబ్బాయి గూడెం గ్రామానికి చెందిన పరిశిక రాజు(39) మద్యానికి బానిసగా మారాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ అతని భార్యను వేధిస్తుండేవాడు.

నేపథ్యంలో బుధవారం ఉదయం మధ్యాహ్నం సేవించి ఇంకా మద్యానికి డబ్బులు కావాలంటూ భార్య వెంకటలక్ష్మిని అడిగాడు. తర్వాత డబ్బులు లేవని తాను డబ్బులు ఇవ్వనట్టు భార్య చెప్పడంతో మనస్థాపాని గురై మధ్య మత్తులో ఇంటిలో రేకులకు ఉన్న ఇనుప రాడ్డుకు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.