calender_icon.png 5 November, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రకాంతిలో మెరిసిన రామప్ప గోపురం

05-11-2025 07:46:55 PM

వెంకటాపూర్/రామప్ప (విజయక్రాంతి): రాత్రి నిశ్శబ్దం ముసురగా, దేవాలయ గోపురం మెల్లగా మెరిసింది. చంద్రుడు తన కాంతి దుప్పటిలో రామప్పను ఆరాధిస్తూ వెలిగాడు. గాలిలో శిల్పాల సవ్వడులు, గోపురపు నీడలో గీతాల నినాదం శివనామస్మరణతో మంత్రముగ్ధమై, రాతి రామప్ప రమణీయంగా విరాజిల్లింది. పౌర్ణమి కాంతి కిరణాల వెన్నెలలో, కాలం కూడా ఆగినట్లే అనిపించింది. భక్తి, శిల్పం, చంద్రుడు మూడు కలసి నిశ్శబ్దానందాన్ని నింపాయి. కార్తీక పౌర్ణమి రాత్రి వెలుగుల్లో రామప్ప దేవాలయం మరో అందమైన రూపాన్ని సంతరించుకుంది.

నిశ్శబ్దమైన ఆధ్యాత్మిక వాతావరణంలో చంద్రుడు తన కాంతిని విరజిమ్మగా, దేవాలయ గోపురం ఆ కాంతి తాకిడితో మంత్ర ముగ్ధంగా మెరిసిపోయింది. రాత్రి ఆకాశం వెన్నెలతో నిండగా, రామప్ప శిల్పాలు చంద్రకాంతి తాకిడిలో సజీవంగా అనిపించాయి. దేవాలయ పరిసరాల్లో భక్తులు దీపాలంకరణలు చేస్తూ శివనామస్మరణలో మునిగిపోయారు. వెన్నెలలో తళతళలాడిన రామప్ప గోపురం దృశ్యం భక్తులను, సందర్శకులను ఆకట్టుకుంది. చంద్రకాంతిలో కమ్ముకున్న రామప్ప దృశ్యం ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ పౌర్ణమి రాత్రిని మరింత విశిష్టంగా మార్చింది.