calender_icon.png 5 November, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

05-11-2025 07:52:34 PM

బెజ్జంకి: కార్తీక పౌర్ణమి వేడుకలు మగువలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, లక్ష్మిపూర్ లోని శివాలయం, అన్ని ప్రసిద్ధ శైవ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బుధవారం తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు పోటెత్తి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మండల పరిధిలోని గాగిల్లాపూర్ మోయతుమ్మెద నది తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి దీపారాధన చేసి, కార్తీక దీపాలను వెలిగించి నీటిలో వదిలారు. నది ఒడ్డున గల రామచంద్రాపురంలోని శివాలయం మహిళలు పెద్ద యెత్తున శివున్ని దర్శించుకొని దీపాలు వెలిగించారు.