కారు ఈడ్చుకెళ్లిన ఘటనలో వ్యక్తి మృతి
14-05-2026 01:04 PM
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడ్ తండా కు చెందిన మూడ్ నాగేష్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం రాత్రి సుమారు 11 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి కారు లో వచ్చి టేకులపల్లి బస్టాండ్ సెంటర్ లో ఆక్సిడెంట్ చేసి కారు తో పాటు వీధి కిలోమీటర్ల మేర సీతారాంపురం వరకు ఈడ్చుకుంటూ వెళ్లడని పలువురు వాహన దారులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలనీ పోలీసులను కోరారు. అనంతరం మూడ్ నాగేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం ఆస్పత్రికి తరలించారు.






