calender_icon.png 26 August, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాబ్లెట్స్ కోసం వెళ్ళిన వ్యక్తి మంజీరా నదిలో మృతి

14-03-2025 12:06:21 AM

కొల్చారం,(విజయక్రాంతి): టాబ్లెట్స్ గురించి వెళ్లిన వ్యక్తి మంజీరా నదిలో మృతి చెందాడు పోలీసుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొల్చారం మండల పరిధిలోని చిన్న ఘనపూర్ గ్రామ శివారులోని ఘనపూర్ ఆయకట్ట నందు పెద్ద శంకరంపేట మండలం ఇంద్ర కాలనీ వాస్తవ్యులు రవీందర్ వయసు 26 సంవత్సరాలు మృతి చెందాడు. మృతుని భార్య నాందేడ్ సౌమ్య కొల్చారం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన ప్రకారం గ్రామం ఇంద్ర కాలనీ పెద్దశంకరంపేట మండల్  ఫిర్యాదు చేసిన రేమనగా తేదీ10.03.2025 నాడు మధ్యాహ్నం  మూడు గంటల సమయంలో తన భర్త  నాందేడ్ రవీందర్ వయసు 36 సంవత్సరాలు వృత్తి వ్యవసాయము కులం ఏసీ మాల  హైదరాబాద్ కు వెళ్లి టాబ్లెట్స్ తీసుకుని వస్తానని భార్యతో చెప్పి  ఇంట్లో నుండి వెళ్లిపోయినాడు తిరిగి ఇంటికి రాలేదు మరుసటి రోజు అనగా 11.03.2025 నాడు ఉదయం అందా జ ఏడు గంటల సమయంలో మృతుడు రవీందర్ ఫిర్యాదురాలకు తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడి ఫోన్ కట్ చేసినాడు తిరిగి ఫిర్యాదురాలు మధ్యాహ్న 12:30 సమయంలో తన భర్తకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది నిన్న తేదీ నాడు రాత్రి అందాజ 9 గంటల సమయంలో కొల్చారం పోలీసు లు ఘనాపూర్ ఆయకట్టలో లభించిన మూగ మనిషి మృతదేహం యొక్క ఫోటోలు  ఫిర్యాదులకు పంపగా అట్టి ఫోటోలు తన భర్తది అని గుర్తించి సౌమ్య పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేయగా  ఎస్ఐ మహమ్మద్ గౌస్  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు