calender_icon.png 26 August, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలి

14-03-2025 12:05:42 AM

ఎస్‌ఐ వెంకటేశ్వర్లు

నారాయణపేట, మార్చి 13(విజయక్రాం తి) : హోలీ పండుగ మరియు రంజాన్ మాసం ఉన్నందున నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రజలు పండుగలను ప్రశాంత వాతావరణంలో మతసామరస్యంగా జరుపుకోవాలని ఎస్త్స్ర వేంకటేశ్వర్లు తెలిపారు. మజీద్ ఇమామ్లతో ఎస్త్స్ర ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పండుగల సమయంలో అందరూ సంయమానం పాటించాలని తమ పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రార్థనలు జరిగే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని జిల్లా కేంద్రంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్‌ఐ తెలిపారుతెలిపారు.