రేవంత్‌రెడ్డి పాలనలో మాలలకు ఉద్యోగాలు.. మాదిగల అరెస్ట్‌లా..
- ఓయూలో ఎంఎస్‌ఎఫ్ దీక్షా శిబిరాన్ని తొలగించడం అప్రజాస్వామికం
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13(విజయక్రాంతి) : సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో మాలలకు ఉద్యోగాలు లభిస్తే, మాదిగలకు అరెస్ట్‌లు మిగిలాయని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, బీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్‌డీ ఇస్మాయిల్, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సీహెచ్ సోమశేఖర్ మాదిగ అన్నారు.
గురువారం ఓయూలో నిరసన ర్యాలీ నిర్వహించి ప్రధాన రహదారిపై నిరసన తెలిపి బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట శాంతియుతంగా నిరసన చేస్తున్న ఎంఎస్‌ఎఫ్ నాయకులను దీక్షా శిబిరాన్ని తొలగించడం , అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు.
ఎస్సీవర్గీకరణ అమలు జరిగేంత వరకు పోరాటం ఆగదని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్‌మాదిగ, ఎంఎస్‌ఎఫ్, ఎమ్మార్పీఎస్ నాయకులు డా.పల్లెర్ల సుధాకర్, బొర్ర బిక్షపతిమాదిగ, బొజ్జ సైదులు మాది గ, బైరపోగు శివ మాదిగ, వీరపాకుల పరశురాములు మాదిగ, కంజర్ల ప్రేమ్‌కుమార్ మాదిగ, జన్నపాల మహేష్‌మాదిగ, తదితరులు పాల్గొన్నారు.






