20-08-2025 02:38:24 PM
రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు..
రామగుండం (విజయక్రాంతి): రామగుండంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష పడిందని బుధవారం రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు(CI Rajeshwara Rao) ఒక ప్రకటనలో తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన నాలుగురికి సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ గోదావరిఖని వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరుచగా ముగ్గురికి రూ. 9,000 వేల రూపాయల జరిమానా విధించారని, ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న రెండవసారి పట్టుబడిన కొల్లూరి ప్రసాద్ కు 3 రోజుల జైలు శిక్ష విధించాడంతో కరీంనగర్ జిల్లా జైలుకు తరలించామన్నారు.