calender_icon.png 20 August, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లా

20-08-2025 02:35:31 PM

కొమురవెల్లి: కాలుకు గాయం తర్వాత శాస్త్ర చికిత్స చేసుకొని దాదాపు మూడు నెలల విశ్రాంతి అనంతరం మొదటిసారిగా నియోజకవర్గానికి సందర్శించడానికి వచ్చిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy)కి టిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలుకాయి. రాజీవ్ రహదారి పక్కన గల మల్లన్న స్వాగత తోరణం వద్ద మద్దూరు, చేర్యాల,దూల్మిట, కొమరవెల్లి మండలాల టిఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చుతూ, మల్లికార్జున స్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మల్లన్న దర్శించుకుని, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భారీ బైక్ ర్యాలీతో చేర్యాలకు తరలివెళ్లారు. ఆయన వెంట స్థానిక టిఆర్ఎస్ నాయకులు నరసింహులు, రాజేందర్ రెడ్డి, గీస బిక్షపతి, సిల్వేరి సిద్ధప్ప, తలారి కిషన్లు ఉన్నారు.