ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. ఓ వ్యక్తి కి తీవ్ర గాయాలు
సత్తుపల్లి,(విజయక్రాంతి): ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన సత్తుపల్లి పట్టణ శివారు లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శివారు డబల్ బెడ్ రూమ్ కాలనీకి చెందిన ఆకోజు రామకృష్ణ సెంట్రింగ్ రాడ్ బెండింగ్ వర్క్ పని చేస్తూ, జీవనం సాగిస్తూ ఉన్నాడు.
మధ్యాహ్న భోజనం అనంతరం సత్తుపల్లి సెంటర్ వైపు వస్తుండగా,సత్తుపల్లి నుంచి అశ్వరావుపేట వైపు వెళుతున్న కారు వేగంగా బలంగా ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఆకోజు రామకృష్ణకు తల కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రి కి తరలించగా, ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం సేవల కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






