రెడ్లకుంట గ్రామంలో 'వన మహోత్సవం'
25-08-2026 09:25 PM
కోదాడ,(విజయక్రాంతి): రెడ్లకుంట గ్రామంలో "వన మహోత్సవ" కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు , డి ఎల్ పి ఓ పార్థసారథి, ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, ఎంపీఓ రాంబాబు పాల్గొని నాటిన మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను పౌరులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమని, భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లెల ప్రసాద్ రావు , ఏపీఓ టానియా , ఈసీ నాగేశ్వరరావు , మల్లెల బ్రహ్మయ్య , ఫీల్డ్ అసిస్టెంట్ సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.






