26 August, 2026 | 12:47 AM

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

25-08-2026 09:28 PM

ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, దోరకుంట  సర్పంచ్ పాలకి సురేష్

కోదాడ,(విజయ క్రాంతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, దోరకుంట  సర్పంచ్ పాలకి సురేష్ అన్నారు. మంగళవారం వన మహోత్సవం సందర్భంగా దోరకుంట గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.గ్రామంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను గ్రామ ప్రజలు తీసుకోవాలని, పచ్చదనం పెంపొందించేందుకు అందరూ సహకరించాలని కోరారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటికి క్రమం తప్పకుండా నీరు అందించి సంరక్షించినప్పుడే వన మహోత్సవం లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు.