మేం కోరుతున్నది రిజర్వేషన్లలో పంపకమే
02-12-2024 01:20 PM
హైదరాబాద్: అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నవారిని మనువాదులు అంటున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మాలవర్గంలో చదువుకున్న వారి సంఖ్య ఎక్కువ ఉందని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాదిగ తెలిపారు. తాము అడుగుతున్నది పంపకమే కదా.. తాము కోరుతున్నది రిజర్వేషన్లలో పంపకమేనని ప్రభుత్వాన్ని కోరారు.




