మందకృష్ణను ఘనంగా సత్కరించాలి
మహబూబాబాద్ (విజయక్రాంతి): వరంగల్ నగరంలో ఈనెల 31న నిర్వహించే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) సన్మాన సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా సత్కరించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కంటిపూడి అరుణ్ కుమార్, వీహెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేపాక శంకర్ పిలుపునిచ్చారు.
ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కొమ్ము నాగరాజు ఆధ్వర్యంలో కేసముద్రం పట్టణంలోని జ్యోతి పూలే సెంటర్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ... ఈనెల 31వ తారీకు చలో వరంగల్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సన్మాన సభకు కేసముద్రం మండలంలోని ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ, మాదిగ ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు హాజరై, వర్గీకరణ జరిగితే ఎస్సీలలో ఉండబడిన 56 కులాలకు న్యాయం జరుగుతుందని 30 సంవత్సరాలుగా అలుపెరగని ఉద్యమం చేసి వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగను సన్మానించడానికి ప్రతి ఒక్కరు కంకణ బద్ధులై రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు మిట్ట గడుపుల జలేందర్, ఏర్పుల మహేష్, ఈదురు సామెల్, పందుల వేణు, దాసరి సురేష్, ఎండి నాగుల్ మీరా, గుండేటి యాకయ్య, కొమ్ము బాబు తదితరులు పాల్గొన్నారు.






