28 June, 2026 | 2:11 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

బైరాపూర్ లో హనుమాన్ స్వాములకు మండల భిక్ష ఏర్పాటు

02-04-2025 08:43 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో విట్టళేశ్వర ఆలయంలో బుధవారం అంగీర్గ పద్మ, దుబాయ్ విట్టల్ గౌడ్ దంపతుల పెద్ద కుమారుడు అంగీర్గ సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ మాలదార స్వాములకు మండల భిక్ష బుధవారం ఏర్పాటు చేశారు. అనంతరం ఆంజనేయ స్వామికి అభిషేకం, హనుమాన్ మాలదారులు పూజా కార్యక్రమం నిర్వహించి ఆంజనేయ స్వామి వారికీ నైవేద్యం సమర్పించి భిక్షనూ స్వీకరించారు. భిక్ష అనంతరం స్వాములకూ పండ్లు పంపిణి చేశారు. కుటుంబ సభ్యులకు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని హనుమాన్ స్వాములు ఆశీర్వదించారు.