7 March, 2026 | 8:35 PM

విజయవంతమైన మండల స్థాయి బాల్ మేళా 2.0 కార్యక్రమం

06-03-2026 07:05 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మందలపల్లి గురుకుల పాఠశాలలో మండల స్థాయి ఎఫ్ఎల్ఎన్ బాలమేళా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాంప్లెక్స్ స్థాయిలో జరిగిన బాల్ మేళా 2.0లో పాల్గొన్న విద్యార్థులలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మొదటి, ద్వితీయ స్థాయిల్లో నిలిచిన విద్యార్థులను ఎంపిక చేసి మండల  స్థాయిలో ఈరోజు బాల్ మేళా2.0 కార్యక్రమం నిర్వహించారు.

ఈ బాల మేళ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొదటి ద్వితీయ బహుమతులు అందజేసి, మండల స్థాయిలో ప్రధమ బహుమతి పొందిన విద్యార్థులను ఈనెల తొమ్మిదో తారీఖున జిల్లా స్థాయిలో నిర్వహించబోయే బాల్ మేళాకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీడీవో రవీంద్రారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల ప్రగతిని నిర్దేశించుటకు ఇటువంటి బాలమేళా ప్రోగ్రాములు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఇలాంటి కార్యక్రమములు నిర్వహిస్తే విద్యార్థులకు పరీక్షలపై మంచి అవగాహన కలుగుతుందని తెలియజేశారు.

మండల విద్యాశాఖ అధికారి జగపతి మాట్లాడుతూ కాంప్లెక్స్ స్థాయిలో నిర్వహించిన బాలమేళా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి మొదటి, ద్వితీయ బహుమతులు అందుకున్న విద్యార్థులను ఎంపిక చేసుకొని మండల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను జిల్లాస్థాయిలో ఎంపిక చేయడం, అలాగే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా మన మండలం నుంచి ఎంపిక అయ్యేలా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు  ఆర్ మారెమ్మ, ఉపేందర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఉషారాణి, రిసోర్స్ పర్సన్  రమేష్ బాబు, రాంబాబు, రామకృష్ణ, కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్, విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది,  ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.