46వ డివిజన్‌లో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
06-03-2026 07:09 PM
పాల్వంచ,(విజయక్రాంతి): తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుండి తలపెట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత పాల్వంచ 46వ డివిజన్ లో కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పాత పాల్వంచలోని నాలుగు మంచినీటి బావులలో బిలీచింగ్ చల్లించారు. పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేయించారు.
మైసమ్మతల్లి దేవాలయం వెనుక బజార్లో డ్రైనేజీ క్లీనింగ్, వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద చెత్తకుప్పలు తొలగించారు. డ్రైన్లకు, రోడ్డు ప్రక్కన వున్న మొక్కలను, చెట్లను తొలగించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపాలిటీ సిబ్బంది, SHG గ్రూప్ సభ్యులు, మహిళలు, పాత పాల్వంచ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




