11 July, 2026 | 8:35 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి

10-07-2026 06:18 PM

బేల,(విజయక్రాంతి): బేల మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే విద్యాలయం (MJP)ను నేడు మండల ప్రత్యేక అధికారి మనోహర్, ఎంపీడీవో మహేష్, వైద్య ఆరోగ్య శాఖా సిబంది  కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు  వసతి, సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల వంటగది (కిచెన్), స్టోర్ రూమ్తో పాటు పాఠశాల ఆవరణను పరిశీలించి పరిశుభ్రత, ఆహార నాణ్యత, మౌలిక సదుపాయాలపై తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని పాఠశాల ప్రిన్సిపాల్ గణేష్ సార్, సిబ్బందికి అధికారులు సూచించారు. ఈ తనిఖీలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.