15 April, 2026 | 4:14 PM

ఖేలో ఇండియాకు మండల యువకులు ఎంపిక

17-02-2026 01:01 AM

గుండాల, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): ఫిబ్రవరి 23 న రాజస్థాన్ లో జరగనున్న ఖేలో ఇండియా ట్రైబల్ మీట్ ఫుట్ బాల్ క్రీడలకు మండలానికి చెందిన నలుగురు యువకులు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 7, 8 తేదీలలో కొత్తగూడెం జిల్లా కేంద్రంగా జరిగిన ఫుట్ బాల్ క్రీడలలో కొమ్ముగూడెం గ్రామానికి చెందిన వాగబోయిన వంశీ, సాయనపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తాటి మోహన్, పోలేబోయిన హర్షిత్, చింతలపాడు గ్రామానికి చెందిన ఊకె శ్రావణ్ కుమార్ లు ప్రతిభ కనపర్చి ఫిబ్రవరి 23 నుండి 27 తేదీ వరకూ ఐదు రోజులపాటు జరగనున్న

ఈ క్రీడలలో వీరు తెలంగాణ జట్టు తరపున ఆడనున్నారు. తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ నాలుగు జట్ల మధ్య జరగనున్న ఫుట్ బాల్ పోటీల్లో గెలుపొంది తెలంగాణకే కాకుండా మారుమూల మన గుండాల మండలానికి పేరు ప్రఖ్యాతలు నిలబెడతామని ఈ నలుగురు క్రీడాకారులు ఆశా భావం వ్యక్తం చేశారు. ఎంపికైన ఈ క్రీడాకారులకు మండలంలోని ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.