23 June, 2026 | 11:06 AM

Breaking News

బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ   •   ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు   •   ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షుడు వంతడుపుల అలియాస్ గొడుగు నర్సయ్య మృతి   •   ఆధారాలు ఉంటే చూపించండి.. మేము లెక్కలు చూపించడానికి సిద్ధం   •   విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం   •   తెలుగే కదా పండితుడు ఎందుకు అనుకుంటున్నారా?   •   కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడి.. సైట్ ఇంచార్జీపై దౌర్జన్యం   •   కోరం కనకయ్య వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడినవి: హరిప్రియ నాయక్   •   వ్యభిచారానికి అడ్డు చెప్పిన గ్రామస్తులపై కత్తితో దాడి   •  

రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తేవాలి

17-02-2026 01:00 AM

విద్యార్థులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నిజామాబాద్, ఫిబ్రవరి 16(విజయ క్రాంతి): రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన బాలబాలికలు తమ ప్రతిభను చాటి నిజామాబాద్ ప్రతిష్టను పెంపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని దోమలగూడలో మంగళవారం నుండి క్రీడా పోటీలు నిర్వహిస్తుండగా, నిజామాబాద్ జిల్లా నుండి 35 మంది బాలబాలికలతో కూడిన బృందం ఈ పోటీల్లో పాల్గొనేందుకు సోమవారం బయలుదేరి వెళ్ళింది.

ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద నుండి చిన్నారులు బయలుదేరి వెళ్తున్న ప్రత్యేక బస్సుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి, చిన్నారులకు ఆల్ ది బెస్ట్ అని విషెస్ తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. చిన్నారులను జాగ్రత్తగా తీసుకెళ్లాలని, క్రీడలు ముగిసిన అనతరం తిరిగి జాగ్రత్తగా తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీ.ఈ.ఓ అశోక్, భవిత కేంద్రాల కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రావు, ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.