calender_icon.png 17 February, 2026 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బల’రాముడి చేయూతతో కేసముద్రంలో గట్టెక్కిన కాంగ్రెస్

17-02-2026 01:01:40 AM

చైర్ పర్సన్‌గా భానోత్ సునీత 

వైస్ చైర్ పర్సన్‌గా డాక్టర్ అల్లం రమ 

కేసముద్రం, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల్లో 16 వార్డులో కాంగ్రెస్ 8, బీఆర్‌ఎస్ 8 స్థానాల్లో కౌన్సిలర్లు విజయం సాధించడంతో హంగ్ ఏర్పడింది. ఈ క్రమంలో సోమవారం నిర్వహించిన మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవుల ఎన్నికకు ఎక్స్ అఫీషియో ఓటు అనివార్యంగా మారింది.

దీనితో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ కేసముద్రం మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగించి తొలిసారిగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకునే విధంగా కృషి చేశారు. సోమవారం మున్సిపాలిటీలో ఎన్నికల అధికారి మధుసూదన్ రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు.

కాంగ్రెస్ నుండి బానోత్ సునీత చైర్ పర్సన్ గా, డాక్టర్ అల్లం రమ వైస్ చైర్ పర్సన్ గా బీఆర్‌ఎస్ నుంచి జాటోతు సుజాత హరి చైర్పర్సన్ గా, రావుల వినయ్ రెడ్డి వైస్ చైర్ పర్సన్ గా పోటీపడ్డారు. బీఆర్‌ఎస్ కు 8 ఓట్లు రాగా, కాంగ్రెస్ కు ఎంపీ ఓటు తో కలిపి 9 ఓట్లు రావడంతో చైర్పర్సన్ గా కాంగ్రెస్ అభ్యర్థి బానోతు సునీత, వైస్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అల్లం రమ ఎన్నికైనట్లు ప్రకటించారు. హంగ్ నుండి కేసముద్రం మున్సిపాలిటీ ఎట్టకేలకు ఎంపీ బలరాం నాయక్ చేయూతతో కాంగ్రెస్ హస్త గతం అయ్యింది.