19 August, 2026 | 1:02 AM

జోగులాంబ ఆలయంలో మండల పూజలు

19-08-2026 12:00 AM

అలంపూర్, ఆగ స్టు 18: అలంపూర్ శ్రీ జోగులాంబ అ మ్మవారి ఆలయం లో శ్రీచక్ర ప్రతిష్ఠాప న జరిగి మండలం రోజులు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక మండల పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు,అర్చకుల ఆధ్వర్యంలో మంగళవారం  నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈవో తెలిపారు.