19 August, 2026 | 1:03 AM

కల్యాణలక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర

19-08-2026 12:00 AM
  1. హామీల అమలు చేతగాకపోతే క్షమాపణ చెప్పి దిగిపోవాలి
  2. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి 

వనపర్తి, ఆగస్టు 18 ( విజయక్రాంతి ) : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో పట్టణ మ హిళలతో కలిసి బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పా ల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసి, ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని 2014 అక్టోబర్ 2న ప్రారం భించి రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచామని, సుమారు 14 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించామని పేర్కొన్నా రు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉన్న పథకానికే దిక్కులేని పరిస్థితి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రభుత్వం దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

పాలమూరు-రంగారెడ్డిపై ఆందోళన

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై త్వరలో వేలాది మందితో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కృష్ణా జలాల విషయంలోనూ తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. శ్రీశైలంలో నీటి లభ్యత ఉన్నప్పటికీ తెలంగాణకు రావాల్సిన నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని తరలించుకుపోతున్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే జీతాలు కాంగ్రెస్ పార్టీ సొమ్ము కాదని, తెలంగాణ ప్రజల చెమటోడ్చి సంపాదించిన డబ్బులతోనే చెల్లిస్తున్నారని అన్నారు. అధికారులు, ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాలు ఉధృతం చేస్తామనిహెచ్చరించారు.