‘కళ్యాణలక్ష్మి’ని కొనసాగించాలి
19-08-2026 12:00 AM
శ్రీరంగాపురం, ఆగస్టు 18: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఆరు గ్యారంటీలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశాల మేరకు నిరసన చేపట్టినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






