కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళపల్లి ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్
కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ఉపసర్పంచ్ బాధ వేణి మురళీకృష్ణ ,మాజీ సర్పంచ్ ఉప్పుల శ్రీనివాస్,నాయకులు గంగాధర్, జీవరత్నం, కే.గంగాధర్, యు.శ్రీకాంత్, యు.మహేష్, డి లచ్చిరెడ్డి, ఏ నర్సయ్య లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... వేములవాడ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో వేములవాడ నియోజకవర్గంతో పాటు కోనరావుపేట మండలం అభివృద్ధి కేవలం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తోనే సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు కచ్చకాయల ఎల్లయ్య,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జెగన్మోహన్ రెడ్డి, మాజీ ప్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




