28 July, 2026 | 1:31 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ వినూత్న కార్యక్రమం

13-01-2026 09:10 PM

చిట్యాల,(విజయక్రాంతి):  తెలుగింటి సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ సంక్రాంత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్యాల పట్టణ కేంద్రంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో  భోగి, సంక్రాంతి, కనుమ పండుగ పర్వదినాలను అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తారు.

మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపాలైన భోగిమంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలు, గొబ్బెమ్మ పాటలు వంటి కార్యక్రమాలు మంగళవారం శ్రీ కనకదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. పట్టణ చరిత్రలో తొలిసారిగా ఈ కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ తరం మర్చిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను తిరిగి ముందు తరాలకు తెలిసేలా కార్యక్రమాలను చేపట్టారు.