13-01-2026 09:17:17 PM
* వాహనాల జరిమానాలు మార్పు కోసమే
ఎస్ఐ చలికంటి నరేష్
గరిడేపల్లి,(విజయక్రాంతి): రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి నియమ నిబంధనలు పాటించాలని గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ అన్నారు.మంగళవారం మండల కేంద్రమైన గరిడేపల్లిలో రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కల్మలచెరువు రోడ్డులో ఆటో డ్రైవర్లకు యువకులకు, ప్రజలకు రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరైవ్–ఎలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమని అన్నారు.
హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం మత్తులో వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. ప్రతి వాహనానికి చెల్లుబాటు అయ్యే పత్రాలు, డ్రైవింగ్ చేసే వారికి లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. రోడ్డు నియమాలు పాటిస్తేనే ప్రాణాలు కాపాడుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకన్న,పోలీస్ సిబ్బంది సుంకరి నగేష్, గోపి, వెంకటేశ్వర్లు, మల్లయ్య, బాలాజీ, నట్టే సైదయ్య ఆటో డ్రైవర్లు పాండు, చంద్రయ్య, రవి, హుస్సేను, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు