calender_icon.png 7 February, 2026 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్మన్‌ఘాట్‌లో మాంగళ్య షాపింగ్ మాల్

07-02-2026 01:10:12 AM

28వ శాఖను ప్రారంభించిన ప్రముఖ సినీ నటి శ్రీలీల

హైదరాబాద్, ఫిబ్రవరి ౬(విజయక్రాంతి): 2012లో తెలంగాణ రాష్ట్రం వరంగ ల్‌లో ప్రారంభమైన మాంగళ్య షాపింగ్ మా ల్, వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేగంగా విస్తరిస్తోంది. నాణ్య మైన వస్త్రాలను సరసమైన ధరలకు అంది స్తూ వినియోగదారుల విశ్వాసాన్ని పొందిన మాంగళ్య, ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో మాంగళ్య షాపింగ్ మాల్ 28వ శాఖను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి శ్రీలీ ల ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించారు. అనంతరం మాల్‌లోని వివిధ విభాగాలను సందర్శించి, అక్కడి కలెక్షన్లను పరిశీలించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా నటి శ్రీలీల మాట్లాడుతూ కర్మన్‌ఘాట్ ప్రజలు మాంగ ళ్య షాపింగ్ మాల్‌కు మంచి ఆదరణ అందిస్తారని నమ్మకం ఉందన్నారు. ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ని యోజకవర్గంలో మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభించినందుకు అభినందించించారు. ఇక్కడ యువతీ యువకులకు ఉపాధి కలుగుతుందన్నారు.

మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహ మూర్తి, కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి వర్గానికి, ప్రతి సందర్భానికి అనువైన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడమే మా విజయ రహస్యమని తెలిపారు. ఈ మాల్ ప్రారంభంతో కర్మన్‌ఘాట్ పరిసర ప్రాంతాల ప్రజలు   తమ ప్రాంతంలోనే నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు కొనుగోలు చేయవచ్చని షాపింగ్ మాల్ నిర్వాహకులు తెలిపారు.