25 February, 2026 | 10:54 PM

ముగిసిన మనికా పోరాటం

01-08-2024 01:47 AM

పారిస్: ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ మనికా బత్రా పోరాటం ముగిసింది. బుధవారం ప్రిక్వార్టర్స్‌లో మనికా 1 జపాన్‌కు చెందిన హిరానో మియూ చేతిలో పరాజయం చవిచూసింది. ఐదు గేముల పాటు జరిగిన మ్యాచ్‌లో మనికా 6 9 14 8 6 ఓటమి పాలయ్యింది. తొలి రెండు గేముల్లో ఓడిన మనికా మూడో గేమ్‌లో గెలిచి పోటీలో నిలబడినట్లే అనిపించింది. కానీ ఆ తర్వాత వరుసగా రెండు గేముల్లో ఓడడంతో క్వార్టర్స్‌కు చేరకుండానే మనికా ఇంటిబాట పట్టింది. ఇప్పటికే పురుషుల విభాగంలో ఆచంట శరత్ కమల్, హర్మీత్ దేశాయ్‌లు పరాజయం పాలైన సంగతి తెలిసిందే.