1 July, 2026 | 9:21 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మంథని ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకుంటా

16-06-2025 12:44 AM
  1. పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు
  2. శ్రీనుబాబుకు జై కొట్టిన నాయకులు, కార్యకర్తలు
  3. పెద్దపల్లి నుంచి మంథని వరకు దారిపొడవునా వెల్లువెత్తిన అభిమానం

పెద్దపల్లి, మంథని, జూన్ 15 (విజయక్రాంతి): మంథని నియోజకవర్గ ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకుంటానని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్య దర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పేర్కొన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా ఆదివారం పెద్దపల్లి జిల్లాకు వచ్చిన దుదిళ్ల శ్రీనుబాబుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అడుగడున ఎత్తున నీరాజనాలు పలికారు.

మహిళలు మంగళహా రతులతో ఘనంగా స్వాగతించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి కమాన్‌పూర్ సెంటినరీ కాలనీ, పన్నూరు, బేగం పేట్, లద్నాపూర్, రామయ్య పల్లి నుంచి మంథని వరకు దారి పొడవునా అభిమానాలు వెలువెత్తాయి. జిల్లాలోని ఆయా మం డలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు శ్రీనుబాబును గజమాలలతో ఘనంగా సత్కరించారు.

ఆదివారం రాత్రి మంథనికి చేరుకు న్నాక, ఇక్కడ జరిగిన అభినందన సభలో శ్రీనుబాబు ప్రజలు, కార్యకర్తల అభిమానం చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ తన తండ్రి శ్రీపాదరావు ఆశ యం మంథని నియోజకవర్గ ప్రజలను కనురెప్పల కాపాడుకోవడమేనని, పార్టీలో తమ కు పదవులు ముఖ్యం కాదన్నారు. ఎన్ని పదవులు వచ్చిన మంథని గడ్డను మరిచేది లేద న్నారు.

కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. నాతోపాటు  ప్రతిఒక్కరూ పార్టీ నిబంధనలకు కట్టుబడే పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికి అందేలా మనమంతా బాధ్యత తీసుకుందామన్నారు.

నియోజకవర్గంలో ఎవరికైనా ఎలాంటి కష్టమొచ్చినా.. శ్రీపాద ట్రస్ట్ అండగా ఉంటుందన్నారు. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే, ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఇది ప్రజాపాలన ప్రభుత్వమని.. ప్రజలకు ఈ ప్రభుత్వంపై నమ్మకంతోనే మనకు ఓట్లు వేశారన్నారు.

వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు శశిభూషణ్ కాచే, కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షుడు ముస్కల సురేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్‌రావు, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు వైనాల రాజు, రోడ్డ బాబు, దొడ్డ బాలాజీ, ఐలి ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్లు కొత్త శ్రీనివాస్, అల్లాడి యాదగిరిరావు, భాస్కరరావు, యూత్ మండల అధ్యక్షులు రెబల్ రాజ్ కుమార్, బక్కదట్ల వినీత్ యాదవ్, శ్రీకాంత్, నాయకులు కుడుదుల వెంకన్న, అజీమ్‌ఖాన్, లింగయ్య యాదవ్ పాల్గొన్నారు.