16 April, 2026 | 8:16 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

కాజీపేట ఆర్‌ఎంయూలో మెము కోచ్‌ల తయారీ

26-06-2025 12:00 AM
  1. --   2026, మే నుంచి ఉత్పత్తి ప్రారంభం
  2. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వివరించిన రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): కాజీపేటలోని రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ ఎంయూ)లో మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (మెము) రైళ్లను తయారు చేస్తామని కేం ద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కేంద్రమంత్రి ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయి తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు.

రైల్వే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో మెము రైళ్లను పెద్దఎత్తున ప్ర వేశపెట్టబోతున్నామని ఈ సందర్భంగా రైల్వే మం త్రి వివరించారు. 16 నుంచి 20 కోచ్‌లు ఉండే ఈ రైళ్లను.. కాజీపేటలో వచ్చే ఏడాది మే నుంచి ఉత్ప త్తి చేయనున్నట్టు వెల్లడించారు. ఈ మెము రైళ్లు గ్రామీణ ప్రాంతాలు, సెమీ-అర్బన్ ప్రాంతాలను అనుసంధానించడంలో ఉపయోగపడతాయని చెప్పారు.

రూ.716 కోట్లతో కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని వైష్ణవ్ వెల్లడించారు. 2026, జనవరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. కచ్చితంగా 2026, మే నుంచి ఈ కేంద్రం ద్వారా ఉత్పత్తి ప్రారం భం కానుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.