16 April, 2026 | 6:26 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఆర్టీసీ సేవలు అందని ద్రాక్షేనా..!

26-06-2025 12:00 AM
  1. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి నేటికి ప్రైవేటు వాహనాలే దిక్కు

బస్సు సౌకర్యం కల్పించమని వేడుకున్నా స్పందించని అధికారులు

రామకృష్ణాపూర్, జూన్ 2౫: మంచిర్యాల జిల్లా కేంద్రానికి  పక్కనే ఉన్నప్పటికీ క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణా నికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో పట్టణ ప్రజలు నిత్యం ఇబ్బందిపడాల్సిన పరిస్థితి దాపురించింది. నిత్యం రామకృష్ణాపూర్ నుంచి ఉద్యోగులు, విద్యార్థులు వందల సంఖ్యలో మంచిర్యాల పట్టణానికి వెళుతూ ఉంటారు. ఆర్టీసీ సౌకర్యం లేక పోవడంతో  ఆటోల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

పట్టణానికి బస్సు సేవలు అందించాలని ప్రజలు అధికారుల ను, ప్రజా ప్రతినిధులకు పలుమార్లు మొరపెట్టుకున్న క్యాతన్‌పల్లి రైల్వే గేటును సాకుగా చూపించి దాటేసిన సందర్భలు లేకపోలేదు. రైల్వే గేటుపై నిర్మించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రాకపోకలు మొదలై నెలలు గడుస్తున్న పట్టణా నికి మాత్రం ఆర్టీసీ సేవలు అందని ద్రాక్షగా నే మారింది. దీనితో ప్రజలు నాయకులు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఆటోలనే నమ్ముకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆటో లేకపోతే వారు వెళ్లాల్సిన ప్రయాణాలు కూడా  ఆపేయా ల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ఆర్టీసీ అధికారులు పట్టణ ప్రజలకు బస్సు సేవ సౌకర్యాలను అందించాలని రామకృష్ణాపూర్ పట్టణ వాసులు కోరుకుంటున్నారు.

బస్సు లేక ఇబ్బందులు..

రామకృష్ణాపూర్ నుంచి మంచిర్యాలకు ఆటో ప్రయాణం తప్ప మరో అవకాశం లేదు. రోడ్డువ్యవస్థ మెరుగుపడ్డ ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం కల్పించడం లేదు. ఆటోలు అందుబాటులో లేకుంటే పట్టణం నుంచి మందమర్రి లేదా శ్రీరాంపూర్ బస్సులో  వెళ్లి అక్కడి నుంచి మంచిర్యాల బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. దీంతో మాకు నిత్యం ఇబ్బంది తప్పడంలేదు.పట్టణం నుంచి జిల్లా కేంద్రానికి బస్సు నడిపేందుకు అనువైన రోడ్లు ఉన్న  బస్సు మాత్రం నడవడం లేదు. 

 ఇ.శంకర్, ప్రైవేట్ ఉద్యోగి, రామకృష్ణాపూర్