16 April, 2026 | 6:27 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఎద్దుల బండ్లతో ఎత్తేస్తున్నారు!

26-06-2025 12:00 AM
  1. నయా దందాకు తెరతీసిన ఇసుకాసురులు

వాగుల నుంచి డంపులకు ఇసుక తరలింపు

వివరిస్తే సీజ్ చేస్తానంటున్నఅధికారులు

చిన్నచింత కుంట జూన్ 25 : అనుమతుల్లేకుండా ఒకరు.. అనుమతుల పేరుతో మరికొందరు పట్టపగలే సహజవనరులను దోచుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న చింతకుంట మండల పరిధిలోని పలు గ్రా మాలలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఎప్పుడు ఎక్కడైనా ట్రాక్టర్లు,ఇ తర వాహనాలతో ఇసుక వ్యాపారులు ద ర్జాగా ఇసుక తరలింపు చేయడం సాధారణం గా జరుగుతుంది.

ఇలా చేయడం ద్వారా ప లు తలనొప్పులు ఉన్నాయని ఆలోచించిన ఇసుక అక్రమ దంద చేసే నిర్వాహకులు నా వద్దకు తేరే లేపారు. ఎద్దుల బండి ద్వారా ఇసుక రవాణా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉం డదు అనుకుని పదుల సంఖ్యలో ప్రత్యేకంగా కొంతమందిని నియమించుకుని ఎద్దుల బండ్లను తయారు చేయించారు.

ఎద్దుల బం డి ద్వారా అనువైన ప్రాంతాలకు వాగు నుంచి ఇసుక తరలించి అక్కడినుంచి డి మాండ్ ఉన్న ప్రాంతాలకు ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా ఇసుక వ్యాపారులు దర్జా గా తరలిస్తూ పోగు చేసుకుంటున్నారు. వాగుల నుంచి ఎద్దుల బండి ద్వారా ఇసుకను తీసుకువస్తున్న వారి నుంచి శ్రమదోపిడి చేస్తూ ఇసుక వ్యాపారులు వారి ఆదా యమే పరమ అవధిగా అడుగులు వేస్తూ దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారు. 

 - పెద్దల అండదండలతోనే అక్రమంగా ఇసుక దందా..?

పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారుల కళ్ళు కప్పి అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని పెద్దల అండదండలతోనే ఇసుక రవాణా జరుగుతున్నదని ప్రజ లు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఈ వా గుల నుంచి వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ నారాయణపేట జిల్లా నర్వ మండల పరిసర ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు.

ఇటు ప్రభుత్వానికి ఆదాయం రాకుండా అక్రమార్కులు ఇసుకను అల్లిపూర్ ఊక చెట్టు వాగు నుండి అక్రమంగా ఇసుకను అమరచింత, ఉంద్యాల పెద్ద కడుమూరు, మరియు నర్వ ఆయా గ్రామాలకు ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు.

అక్కడక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ అడ్డదారుల్లో అక్రమ ఇసుక దర్జాగా తరలిస్తు న్నా రని ఆరోపణలు బలంగా ఉన్నాయి. చిన్నచింతకుంట మండల పరిసర ప్రాంతాలలోని బండ్రవల్లి, వడ్డేమాన్, చింతకుంట, అల్లిపూ ర్ గ్రామ సమీపంలోని ఊక చెట్టు వాగుల నుంచి నిర్విరామంగా ఇసుక దోపిడీ జరుగుతోంది.

- ఆదాయమే ముఖ్యం...

అల్లిపూర్ గ్రామ సమీపంలోని ఊక చెట్టు వాగు నుండి ఎద్దుల బండ్లు ద్వారా డంపింగ్ చేసి అమరచింత మున్సిపాలిటీ పరిసర ప్రాంతాలకు, ఉంద్యాల, పెద్ద కడుమూరు,నర్వ మండల పరిసర గ్రామాలకు ఇసుకను ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తుండ్రు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ. 6 వేల నుంచి రూ. 10వేల వరకు ఒక్కో ఎద్దుల బండి లో డికి రూ రూ 700 నుంచి రూ 800 వరకు ట్రాక్టర్ యజమానులు ఇస్తున్నారు.

ట్రాక్టర్ నిర్వాహకులు ఎద్దుల బండిలతో ఇసుక రవాణా చేస్తున్న వారి నుంచి శ్రమదోపిడి చేస్తూ దోచుకుంటున్నారు. ఎద్దుల బండ్లు దాదాపు 20 దాకా ఇసుక రవాణా చేస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఆయా గ్రామాల్లో కొంతమంది ఇసుక మాఫియాగా ఏర్పడి దందాను కొనసాగిస్తున్నారు. ఇసుక దందాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఇసు క మాఫియా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

-చూపించండి ...సీజ్ చేస్తాం..

ఎక్కడైతే అక్రమంగా ఇసుక డంపు చేయడం జరుగుతుందో ఆ ప్రాంతంలో చూయించండి వెంటనేసీజ్ చేస్తాం. అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చే యడం జరుగుతుంది. ఎక్కడైనా మీదృ ష్టికి వస్తే మాకు చెప్పండి. మీరు తాసిల్దార్ కార్యాలయానికి చేరుకొని ఆర్‌ఐ కి చెబుతా మీ వెంట తీసుకువెళ్లి చేపియం డి. అనుమతులు లేకుండా ఇసుక రవా ణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 

ఎల్లయ్య, తహసిల్దార్, సిసి కుంట మండలం.