10 March, 2026 | 1:49 AM

మానుకోట కలెక్టర్ వినూత్న ప్రజావాణి

10-03-2026 12:20 AM

గూగుల్ మీట్ ద్వారా అధికారులతో సమస్యలపై ఆరా 

మహబూబాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్ర జావాణి కార్యక్రమాన్ని మహబూబాబా ద్ జిల్లా కలెక్టర్ గా ఇటీవల నియమితురాలైన స్నేహ శబరిష్ సోమవారం ప్రజ ల నుండి సమస్యలపై వచ్చిన ఆర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి వినూత్న తరహాలో విచారణకు పూనుకున్నారు. ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో మండల స్థాయి అధికారులతో గూగుల్ మీట్ ద్వారా వారి సమస్యలకు పరిష్కారాన్ని మండల స్థాయి అధికారులతో చర్చించారు.

ప్రజల నుండి 136 దరఖాస్తులు రాగా అందులో అప్పటికప్పుడే పరిష్కరించదగ్గ పలు సమస్యలను వెంటనే మండల స్థాయి అధికారులతో కలెక్టర్ మాట్లాడి వాటిని సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. గతంలో ఆయా శాఖలకు సిఫారసు చేయకుండా, నేరుగా గూగుల్ మీట్ ద్వారా మండల స్థాయి అధికారులతో కలెక్టర్ మాట్లాడడం, సమస్యలకు సత్వర పరిష్కారం చూపడంతో దరఖాస్తులు ఇచ్చిన ప్రజలు కలెక్టర్ తీరును అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.