27 June, 2026 | 2:21 PM

Breaking News

అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తులు చేసుకోండి   •   రెండు చుక్కలే..చిన్నారుల భవిష్యత్‌ కు రక్షణ!   •   మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •  

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

10-03-2026 12:20 AM

8 మంది అరెస్ట్ 

రూ. 1.78 లక్షల నగదు స్వాధీనం

ఘట్ కేసర్, మార్చి 9 (విజయక్రాంతి) : పేకాట స్థావరం పై పోలీసులు దాడి చేసి 8మందిని అరెస్ట్ చేసిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశ్వాసనీయ సమాచారం మేరకు ఘట్ కేసర్ ఈడబ్ల్యూఎస్ కాలనీలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట కేంద్రంపై దాడి చేసి అక్కడ పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అరెస్టు అయిననిందితులు తనంచించల కోటయ్య (మేస్త్రీ గాంధీనగర్), చుట్కే సుధాకర్ (డ్రైవర్ ప్రతాపసింగారం), ఎద్దుల అజయ్ (మేస్త్రీ ఎన్ ఎఫ్ సీ నగర్), బల్లికూరి సురేష్ (మేస్త్రీ, చిలుకానగర్), ఉప్పు సూర్యనారాయణ (మేస్త్రీ, గాంధీనగర్) కుంచాల సాంబయ్య (మేస్త్రీ మేదపటి నగర్), తన్నీరు ప్రసాద్ (మేస్త్రీ, బాలాజీ నగర్), కొట్టాల శ్రీనివాస్ (ఇంటి యజమాని, ఈడబ్ల్యూఎస్ కాలనీ) ఉన్నారు. అక్కడ లభించిన నగదు రూ. 1లక్ష, 78వేల, 500, 8 మొబైల్ ఫోన్లు, 8 సెట్ల పేక ముక్కలు స్వాధీనం చేసుకుని ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.