calender_icon.png 18 September, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు, ప్రముఖులు

18-09-2025 01:51:00 AM

* ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నేడు ప్రపంచం మొత్తం మీ మార్గదర్శకాలపై విశ్వాసంగా ఉంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.

 ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి

* మీ దార్శనిక నాయకత్వంలో ప్రపంచ వేదికలపై భారత్ తన ముద్ర వేస్తోంది. అభివృద్ధి చెందిన దేశం అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

 సీపీ రాధాకృష్ణన్, ఉపరాష్ట్రపతి

* కోట్లాదిమంది భారతీయుల ప్రేమను పొందుతున్న ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ‘మొదట దేశం’ అనే మీ నినాదం ప్రతి పౌరుడికి ప్రేరణనిస్తోంది.

 కేంద్ర హోం మంత్రి

* ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నా. 

 మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

* ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. 

 రాహుల్ గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత

* మిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీతో అద్భుతమైన ఫోన్ కాల్ మాట్లాడా. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశా. ఆయన అద్భుతంగా పని చేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపులో మీ మద్దతుకు ధన్యవాదాలు.

 డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు

* మీ 75వ జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలను దయచేసి స్వీకరించండి. మన దేశాల నడుమ భాగస్వామ్యం మరింత బలపడేందుకు మీరు ఎంతో కృషి చేస్తున్నారు. 

 వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

* ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు భగవంతుడు ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదించాలి.

 రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి

* ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సరైన సమయంలో, సరైన లీడర్ దొరకడం మా అదృష్టం. దేశాన్ని దృడ నాయకత్వంలో ముందుకు నడిపిస్తున్నారు. 

 చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి

* ప్రధాని మోదీ పాలనకే పరిమితం కాకుండా ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ఐక్యతను పెంపొందించారు. ప్రతి పౌరుడు మన సంస్కృతి, వారసత్వం పట్ల గర్వపడేలా చేశారు. 

 పవన్ కల్యాణ్, ఏపీ ఉపముఖ్యమంత్రి