calender_icon.png 18 September, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్తంభించిన జన జీవనం

18-09-2025 01:50:58 AM

-వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయం

-ప్రధాన రహదారులపై నిలిచిన నీరు

-ట్రాఫిక్ కష్టాలతో జనం బెంబేలు

-రికార్డు స్థాయి వర్షంతో అప్రమత్తం అయిన జీహెచ్‌ఎంసీ, హైడ్రా బృందాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 17: గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్న వర్షం బుధవారం కూడా విడిచిపెట్టలేదు. బుధవారం మధ్యాహ్నం నుంచే వరణుడు తన ప్రతాపం చూపెట్టడం మొదలుపెట్టాడు. సాయంత్రం వరకు చెదురుముదురుగా కురిసిన వాన రాత్రి ఒక్కసారిగా కుండపోతగా మారింది. రాజధాని నరగంలోని లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోయాయి. ఇక ప్రధాన రహదారులు సైతం బ్లాక్ అయ్యాయి.

రహదారు లపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ముంబై మార్గంలో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భోలఖ్‌పూర్ మార్గంలో వాహనాలు కొట్టుకుపోయాయి. సికింద్రాబాద్ మనోహర్ థియేటర్ వద్ద భారీగా వరదనీరు ప్రవహించింది. మియాపూర్ చందా నగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శేరిలింగంపల్లిలో 12.6 సెం.మీ, బేగంపేటలో 8.7 సెం.మీ, మెట్టుగూడలో 10.2 సెం.మీ వర్షం కురిసింది. భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు.

  నగరంలోని ఉప్ప ల్, నాచారం, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట్ట, అమీర్ పేట, మైత్రివనం, ఎస్‌ఆర్ నగర్, మూసాపేట, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, చందానగర్, మియాపూర్, నిజాం పేట, ప్రగతినగర్, జగద్గిరిగుట్ట, అల్విన్ కాలనీ, బాలానగర్, చింత ల్, ఐడీపీఎల్, షాపూర్ నగర్, హెచ్‌ఎంటీ, సూరారం, గాజులరామారం, బోయిన్‌పల్లి, సుచిత్ర, అల్వాల్, లోతుకుంట, తిరుమలగిరి, ప్యాట్నీ, ప్యారడైజ్, సైనిక్‌పురి, వాయు పురి, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, వెంకటగిరి, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గ్, షేక్‌పేట, మెహదీపట్నం, చార్మినార్, ట్యాంక్ బండ్, మసాబ్‌ట్యాంక్, రాజేం ద్రనగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ముసారాంబాగ్, కోఠి, నాంపల్లి, లక్డీకాపూల్, లింగం పల్లి, గచ్చిబౌలి, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, హెచ్‌సీయూ, గండిమై సమ్మ, దుండిగల్, కాప్రా, శేరిలింగం పల్లి, తదితర ప్రాంతాల్లో వరణుడు తన ప్రతాపం చూపెట్టాడు. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది వర్షపు నీటిని తొలగిస్తూ వాహనదారులకు సాయం చేశారు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసిం ది. 

ఇదిలా ఉండగా ముషీరాబాద్‌లో రికార్డుస్థాయిలో 15 సెం.మీ. వర్షం, సికింద్రా బాద్ (మోండా మార్కెట్): 13.20 సెం.మీ., మారేడ్‌పల్లి (న్యూ మారేడ్‌పల్లి ప్రైమరీ స్కూల్): 13.03 సెం.మీ., ముషీరాబాద్ (భోలక్‌పూర్): 12.88 సెం.మీ., శేరిలింగంపల్లి (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్): 12.60 సెం.మీ., ముషీరాబాద్ (ఖైరతాబాద్ సర్కిల్): 12.45 సెం.మీ., శేరిలింగంపల్లి (మియాపూర్): 12.35 సెం.మీ., మారేడ్‌పల్లి (పికెట్ హౌస్): 11.85 సెం.మీ., చందానగర్ సర్కిల్-21: పీజేఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 11.23 సెం.మీ, మాదాపూర్: న్యూ మెట్టుగూడ ప్రైమరీ స్కూల్ వద్ద 10.23 సెం.మీ, గచ్చిబౌలి: 9.43 సెం.మీ, జూబ్లీ హిల్స్ 8.93 సెం.మీ, షేక్‌పేట 8.75 సెం.మీ, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, పటాన్‌చెరు, ఆసిఫ్‌నగర్, కార్వాన్ ప్రాంతాల్లో సగటున 5 సెం.మీ.లకు పైగా 

ట్రాఫిక్ నరకం..

ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే కీలకమైన సాయంత్రం వేళ వర్షం దంచికొ ట్టడం తో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఐటీ కారి డార్‌లో పరిస్థితి దయనీయంగా మారింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాం తాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాగా అమీర్‌పేట, బంజారాహిల్స్ వంటి ప్రధాన కూడళ్లలో వాహనాలు నత్తనడకన కదిలాయి.