26 April, 2026 | 3:20 PM

బెంగళూరులో మారథాన్ విజయం

26-04-2026 02:01 PM

– అంతర్జాతీయ స్థాయికి అడుగులు వేస్తున్న గ్రామీణ యువ రన్నర్

కోనరావుపేట,(విజయక్రాంతి): ఆదివారం రోజున బెంగళూరులో నిర్వహించిన టీసీఎస్ వరల్డ్ ఇంటర్నేషనల్ మారథాన్‌లో పాల్గొని విజయవంతంగా రన్ పూర్తి చేసి మెడల్ సాధించారు. ఈ విజయంతో ఆయన అంతర్జాతీయ స్థాయి రన్నర్‌గా తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. ఈ మారథాన్ ప్రోకామ్ స్లామ్‌లో భాగంగా నిర్వహించబడుతున్న నాలుగు ప్రముఖ మారథాన్‌లలో ఒకటి.

ఈ సిరీస్‌లో టాటా ముంబయి ఇంటర్నేషనల్ మారథాన్ (42.195 కిమీ), టీసీఎస్ వరల్డ్ బెంగళూరు మారథాన్ (10 కిమీ), వేదాంత ఢిల్లీ మారథాన్ (21 కిమీ), కలకత్తా మారథాన్ (25 కిమీ) ఉన్నాయి. ఇందులో భాగంగా, జనవరి 18, 2026న జరిగిన టాటా ముంబయి ఇంటర్నేషనల్ మారథాన్‌లో 42.195 కిలోమీటర్ల రన్ పూర్తి చేసి మెడల్ సాధించారు. తాజాగా బెంగళూరు మారథాన్‌లో 10 కిలోమీటర్ల రన్ పూర్తి చేసి అర్హత సాధించి, తదుపరి వేదాంత ఢిల్లీ ఇంటర్నేషనల్ మారథాన్‌కు సెలెక్ట్ అయ్యారు. తాను ఇండియన్ ప్రో లెవెల్ రన్నర్‌గా ఎదగడమే తన లక్ష్యమని తెలిపారు.

తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఒక చిన్న గ్రామమైన ఎగ్లాస్పూర్‌లో జన్మించిన ఆయన, గత 15 సంవత్సరాలుగా కరాటే మరియు కిక్ బాక్సింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటే క్రీడలు, ముఖ్యంగా రన్నింగ్ మరియు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. తన ప్రయాణం ద్వారా గ్రామీణ యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు.