26 April, 2026 | 3:30 PM

ఘనంగా శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన

26-04-2026 01:56 PM

గుండాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద ఆదివారం శ్రీశ్రీశ్రీ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన కార్యక్రమాన్ని మండల విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సంఘ పెద్దలు కొబ్బరికాయలు కొట్టి, పంచ వృత్తుల జెండాను ఆవిష్కరించిన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు.

మండల విశ్వకర్మ సంఘం అధ్యక్షులు మాజోజు చంద్రాచారి మాట్లాడుతూ... పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన దివ్యదృష్టితో కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే చెప్పారని అన్నారు. ఆయన చెప్పిన కాలజ్ఞానం ద్వారా ఇప్పటివరకు చాలా ఘటన జరిగాయని, అలాంటి మహోన్నతమైన గురువును మేము ఆరాధించడం మాకెంతో గర్వంగా ఉందని అన్నారు. ఈ ఆరాధన కార్యక్రమంలో సంఘ సభ్యులు, యువత, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.