తెలంగాణ పల్లెల కథ మారెమ్మ
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్- డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్(Manchala Nagaraj) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్‌రెడ్డి బండారు నిర్మిస్తున్నారు.
దీపా బాలు కథానాయిక కాగా, వినోద్‌కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్‌రెడ్డి, వీఎస్ రూపాలక్ష్మి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 10 విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను స్టార్ హీరో రామ్ పోతినేని మంగళవారం డిజిటల్‌గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ వేడుకకు టాలీవుడ్ దర్శకుడు శివ నిర్వాణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శివ నిర్వాణ మాట్లాడుతూ.. “ఒక డెబ్యూ హీరోగా మాధవ్ మంచి కంటెంట్ బేస్డ్ సినిమాను ఎంపిక చేసుకోవడం అభినందనీయం. సినిమా బ్లాక్‌బస్టర్ కావడానికి ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి” అన్నారు. హీరో మాధవ్ మాట్లాడుతూ.. “ఒక దున్నపోతుకు మరొక మనిషికి ఉండే అనుబంధం ఎలా ఉంటుందో సెప్టెంబర్ 10న ప్రేక్షకులకు కనిపించబోతుంది. రవితేజ ఈ సినిమా చూశారు. ఆయనకు క్లైమాక్స్ చాలా అద్భుతంగా నచ్చింది. చాలా ఎమోషనల్ అయ్యారు” అని చెప్పారు.
‘తప్పకుండా అందరూ మా సినిమా చూడాలని కోరుకుంటున్నా’నని హీరోయిన్ దీప తెలిపింది. డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. “మన ఊరిలో జరిగిన కథ చూస్తున్నట్టు ఉంటుంది. మనందరి ఊర్లలోని కల్చర్‌ను విజువల్‌గా చూడబోతున్నారు” అన్నారు. నిర్మాత మయూర్ మాట్లాడుతూ.. “ఇది మన తెలంగాణ పల్లెటూరి సినిమా. మన అందరి ఊర్లలో ఉండే కథ. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది” అని చెప్పారు. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.






